ఆవు పాలు ? స్వచ్ఛంగా ఇంటి వద్దకే కావాలా? – ఇదం జగత్

పుట్టాక మొదటగా మనం తీసుకునే ఆహరం పాలు!

తెల్లనివన్నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు అంటారు  అప్పుడే పుట్టిన శిశువు మొదలు పండు ముసలి వరకు ప్రతి ఒక్కరు తీసుకునే పదార్థం పాలు పాలల్లో శ్రేష్టమైనవి ఆవు పాలు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలను అతి కొద్ది మందిని మినహాయించితే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇష్టపడని ఆ కొద్ది మంది కూడా కాఫీ, టీ లేదా మిఠాయి రూపంలో తీసుకుంటారు. మజ్జిగ, పెరుగు, నెయ్యి అన్నిటికి పాలే కదా మూలం! ఇవ్వన్నీ స్వచ్ఛంగా ఉండాలంటే పాలు కూడా స్వచ్ఛంగా ఉండాలి.మరి ప్రతిరోజూ తీసుకునే పాలు ఎంత వరకు స్వచ్ఛంగా ఉంటాయో తెలుసుకునే ఓపిక ఆలోచన లేవు!

ఎంత మంచి పేరున్న సంస్థ తయారు చేసే పాలు అయినా ఎక్కడో ఒక అనుమానం! ఇవి నిజంగా మన ఆరోగ్యాన్ని ఉద్ధరిస్తాయా లేక పాడు చేస్తాయా అని. అదే పల్లెటూరిలో పాలు పట్టణంలో అమ్మే పాలకంటే ఎంతో నయం అని అందరికి తెలుసు. ఎందుకంటే అక్కడ మన కళ్ళ ముందే పితికి ఇస్తారు కాబట్టి! అయినా అవి సురక్షితంగా అంటే కాదనే చెప్పుకోవాలి, ఎందుకంటే ఆవు స్వచ్ఛంగా పాలు ఇస్తున్నప్పటికీ పాలవాడు స్వచ్ఛమైన నీళ్లు కలుపుతున్నప్పటికీ ఆ పాలు ఇచ్చే ఆవు తినే ఆహరం రసాయనాలతో పండించినట్టయితే ఆ పాలు కూడా స్వచ్ఛం కాదు. ఇంక పాలు అమ్మే కంపెనీల సంగతి సరేసరి!

సేంద్రీయ ఎరువులతో మంచి వాతావరణంలో మంచి ఆహరం తిని పాలిచ్చే ఆవు పాలు దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం! దొరికినా ఇంటిదగ్గరకు వచ్చి పాలు పొసే వారు అసలు దొరకరు. కాలం మారుతుందిగా! కార్పొరేట్ ఆసుపత్రులకు ఆస్తులు రాసివ్వడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేరు. ఈ అవసరాన్ని తీర్చడానికి ఇప్పుడు కొంతమంది ఔత్సాహికులు విశాలమైన స్థలంలో రసాయనిక ఎరువులు వాడకుండా పండించిన ఆహారాన్ని స్వచ్ఛమైన వాతావరణంలో మేలైన గిర్ జాతి ఆవులను పెంచుతూ వాటి పాలని అడ్డమైన పాలీ ఇథలిన్ కవర్లలో కాకుండా గాజు సీసాలలో ఇంటి వద్దకే వచ్చి అమ్ముతున్నారు.

ధర కొంచెం ఎక్కువయినప్పటికీ “గంగి గోవు పాలు గరిటెడైన చాలు” కాబట్టి ఇటువంటి పాలను వాడటం ఎంతో శ్రేయస్కరం! మీరు చేయవలసిందల్లా ఈ లింక్ ద్వారా అలాంటి పాలని డెలివరీ చేస్తున్న Go Desi Milk వారిని సంప్రదించి మీకు కావలసినన్ని పాలను ఇంటివద్దనే తీసుకోండి. పాలకు సంబంధించి అయ్యే బిల్లును వారాల వారీగా లేదా నెల తర్వాత వారి ఖాతాలో గాని లేదా PayTM ద్వారా చెల్లించండి.

ఇలా వచ్చిన పాలను వెంటనే వేడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు.

Go Desi Milk ఆవు పాలు ఉపయోగాలు:

  • సహజమైనవి, మరియు పౌష్టికాహారం
  • బలాన్ని సామర్థాన్ని పెంచుతాయి
  • వ్యాధి నిరోధక శక్తిని, బుద్దిని పెంచుతాయి
  • ఒమేగా 3, కాల్షియమ్, ప్రోటీన్, మినరల్స్, బీటా కెరోటిన్ కలవు
  • సులభంగా జీర్ణమవుతాయి
  • శిశువులు, పిల్లలు, పెద్దలు అందరికి మంచిది

మీ ప్రాంతానికి డెలివరీ ఉందా లేదా మరియు పూర్తి వివరాలకు Go Desi Milk వెబ్సైటు ను సందర్శించి పాలను ఆర్డర్ చేసుకోగలరు. రేపటినుంచే స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన పాలను తాగండి. తల్లి పాలు లేనప్పుడు స్వచ్ఛమైన ఇటువంటి పాలని ఇచ్చి ఆరోగ్యవంతమైన జీవితాలను పిల్లలకి అందించండి. ” ఆరోగ్యమే మహాభాగ్యం “.

https://idamjagath.com/te/topics/wellness/cow-milk-home-delivery/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *